Skip to main content

Posts

Showing posts from February, 2020

జీవశాస్త్ర ఉపాధ్యాయుడి విశిష్ట స్రుష్ఠి 17/02/2020 8am

🌍SAA స్కూల్ అసిస్టెంట్స్ అసోషియేషన్ జీవశాస్త్ర ఉపాధ్యాయుడి విశిష్ట స్రుష్ఠి భౌతిక, ఖగోళ అంశాలపై చిన్నారులకు అవగాహన ఆయనో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు... భౌతికశాస్త్రం, ఖగోళశాస్త్ర అంశాలను ఆసక్తితో సొంతంగా నేర్చుకున్నారు. వాటిపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్నారు. రూ.2.5 లక్షలతో స్థలం కొని, ఓ పూరిపాక వేసి, ‘డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌కలాం గ్రామీణ బాలల పరిశోధన కేంద్రం’ ఏర్పాటు చేశారు. అందులో ఖగోళ అధ్యయన పరికరాలను ఉంచి, పరిసర గ్రామాల పిల్లలకు విశ్వ విశేషాలను ప్రయోగాత్మకంగా వివరిస్తున్నారు. తన జీతంలో కొంత వెచ్చిస్తూ... తోటి ఉపాధ్యాయుల ఆర్థిక సహకారంతో ఇప్పటిదాకా రూ.25 లక్షలు ఖర్చు చేయడం విశేషం. నెల్లూరు జిల్లాలోని సంగం మండలం గాంధీజనసంఘం.. ప్రపంచ ప్రసిద్ధ పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు పుట్టిన ఊరు. ఈ గ్రామానికే చెందిన సుబ్రమణ్యం సంగం మండలంలోని తరుణవాయి ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కనిగిరి రిజర్వాయర్‌లోని జీవవైవిధ్యంపై పదేళ్ల క్రితం 13 ప్రాజెక్టులు చేపట్టారు. కొన్ని జీవులు ఎలాంటి మొక్కలపై జీవిస్తాయి? ఏ పరిస్థితుల్లో బతుకుతాయో పరిశోధించి డాక్యుమెంటరీ సిద్ధం చేశా